సుప్రీం కోర్టు చరిత్రలో చీఫ్ జస్టీస్ ఎన్ వీ రమణ ఆధ్వర్యం లో ఉండే కొలీజియం సంచలన నిర్ణయం తీసుకుంది. మరో పురుషుని తో సహజీవనం చేస్తున్న గే ని జడ్జీ గా నియమించాలని కొలీజియం సిపార్సు చేసింది. దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఉన్న హై కోర్టు న్యాయమూర్తి గా సీనియర్ న్యాయవాది సౌరబ్ కిర్‌పాల్ పేరు సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు చేసింది.
అయితే ఇప్పటి వరకు సుప్రీం కోర్టు కొలీజియం సౌరబ్ కిర్‌పాల్ ను పట్టించు కోలేదు. అయితే ప్రస్తుతం చీఫ్ జస్టీస్ రమణ నేతృత్వంలో ఉన్న కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. కాగ సౌరభ్ కిర్‌పాల్ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వీఎన్ కిర్‌పాల్ కుమారుడు. కాగ 2017 లో సౌరభ కిర్‌పాల్ విదేశీ రాయబార కార్యాలయంలో పని చేశాడు. అ సందర్భం లో అక్కడ ఒక పురుషున్ని జీవిత భాగస్వామిగా ఎంచు కున్నారు. ఇది ఇలా ఉండగా సౌరభ్ కిర్‌పాల్ గతంలో గే హక్కుల కోసం సుప్రీం కోర్టు లో పొరాడి విజయం సాధించాడు.