RADHESHYAM : రాధేశ్యామ్ ఫస్ట్ సింగల్ రిలీజ్ : ప్రభాస్ ఫాన్స్ కు ఇక పండగే !

-

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా రాధేశ్యాం. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా… యువి క్రియేషన్స్ సమర్పణలో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతోంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, టాలీవుడ్ పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ తేదీని అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ”ఈ రాతలే” అనే లిరిక్స్ తో ప్రారంభం అయ్యే.. ఫుల్ సాంగ్ ను చిత్ర బృందం కాసేపటి క్రితమే విడుదల చేసింది. సాయంత్రం నుంచి ప్రభాస్ ఫాన్స్ ఎంతో ఆతృతగా ఈ సాంగ్ కోసం ఎదురు చూశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల.. అనుకున్న సమయానికి విడుదల చేయలేదు చిత్ర బృందం. ఇక ఈ సాంగ్ సినిమా అంచనాలను పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version