ఎయిర్ పోర్ట్ లేని ఐదు దేశాల గురించి మీకు తెలుసా..?

-

కరోనా మహమ్మారి తర్వాత ట్రావెలింగ్ అంటేనే భయపడిపోతున్నారు. ఎక్కడికి వెళ్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అన్న సందేహంతో ఎవరి దేశాల్లో వారే ఉండిపోతున్నారు. అత్యవసరం అయితే తప్ప వేరే ప్రదేశాలకి వెళ్ళడం లేదు. ఇక ట్రావెలింగ్ గురించి ఆలోచించడమే మానేసారు. అయితే మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, ముఖ్యంగా ఇతర దేశాలకి వెళ్దామనుకుంటే వెంటనే ఆలోచించేది విమానాల గురించే. ఎప్పుడెప్పుడు టికెట్లు బుక్ చేద్దామా, ఎప్పుడెప్పుడు కొత్త ప్రదేశానికి వాలిపోదామా అని ఆలోచిస్తాం.

కానీ మీకో విషయం తెలుసా? ప్రపంచంలో ఎయిర్ పోర్ట్ లేని దేశాలు కూడా ఉన్నాయి. వాటిని చూడాలంటే ఎయిర్ పోర్ట్ లో వెళ్లాల్సిన పనిలేదు. అంటే ఆ దేశ భూభాగంలో ఎయిర్ పోర్టే లేదు. ఆ ఐదు దేశాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వాటికన్ సిటీ

ప్రపంచంలో అతి చిన్న దేశమైనా వాటికన్ సిటీకి ఎయిర్ పోర్ లేదు. ఇక్కడకి చేరుకోవాలంటే రోమ్ వరకు విమానంలో వచ్చి అక్కడి నుండి బస్సుమీదే వెళ్ళాల్సి ఉంటుంది.

సాన్ మరినో

ఇటలీ దేశంతో చుట్టబడి ఉన్న సాన్ మరినో, ప్రపంచంలో ఐదవ అతి చిన్న దేశంగా ఉంది. ఈ దేశానికి వెళ్లాలంటే ఇక్కడ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయంలో దిగాలి.

మొనాకో

మూడువైపులా ఫ్రాన్స్, ఒకవైపు మెడిటేరినియన్ సముద్రం ఉన్న ఈ దేశానికి వెళ్లాలంటే ఫ్రాన్స్ లో ఉన్న అజుర్ ఎయిర్ పోర్ట్ కి చేరుకోవాలి. అక్కడ నుండి అరగంట కారులో ప్రయాణిస్తే మొనాకో చేరుకుంటాం.

అండోర్రా

స్పెయిన్, ఫ్రాన్స్ ల మధ్య బోర్డర్ లా ఉన్న ఈ దేశానికి ఎయిర్ పోర్ట్ లేదు. ఇక్కడకి వెళ్లాలనుకుంటే ఫ్రాన్స్ నుండైనా, స్పెయిన్ నుండైనా వెళ్ళవచ్చు.

లైటెన్స్ టెయిన్

ఆస్ట్రియా, జర్మనీ మధ్య ఉన్న బార్డర్ ఇది. ఇక్కడకి వెళ్లాలంటే కారు, రైలు తో పాటు పడవ సౌకర్యం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version