చలికాలంలో మీరు వద్దంటున్న ఆహారాలు మీ చర్మానికి ఎంత మేలు చేస్తాయో తెలుసుకోండి.

-

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ వ్యాధులు అటాక్ చేసేస్తాయి. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా చర్మ సంరక్షణ సరిగ్గా లేకపోయినా చర్మ వ్యాధులు తొందర తొందరగా వ్యాపించి తొందరగా మానకుండా ఇబ్బంది పెడుతుంటాయి. ఐతే చర్మ సంరక్షణ సాధనాలు వాడుతున్నా ఇలాంటి ఇబ్బందులు ఏర్పడడానికి కారణం మనం తీసుకునే ఆహారమే. చలికాలంలో కొన్ని ఆహారాలని పక్కన పెట్టడం వల్ల చర్మ వ్యాధులు వస్తున్నాయని మీకు తెలుసా? ఆ ఆహారాలేంటో తెలుసుకుని మీ ఆహారంలో భాగం చేసుకోండి.

ఆకుకూరలు

ఆకుకూరలు చలికాలంలో తినడం చాలా మంచిది. ఇందులో ఆంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లేమేటరీ కారకాలు బాగా ఉంటాయి. ఇంకా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా చర్మం సురక్షితంగా ఉంటుంది.

నీళ్ళు

చలికాలం వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్ళు తాగడం తగ్గిస్తారు. కానీ అది మంచి పద్దతి కాదు. చలికాలమైనా, ఎండకాలమైనా కావాల్సినన్ని నీళ్ళు శరీరానికి చాలా అవసరం. లేదంటే శరీరం డీ హైడేషన్ కి గురై చర్మ పొడిబారిపోవడం, పగుళ్ళు ఏర్పడడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

గింజలు

బాదం, కాజు, వాల్ నట్స్ వంటివి శరీరానికి రోగనిరోధక శక్తిని అందించడంతో పాటు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి.

పండ్లు

కొన్ని రకాల పండ్లు మాత్రమే తినకుండా పాత్రలో రకరకాల పండ్లు నిండి ఉంటే బాగుంటుంది. ఒక్కో పండులో ఒక్కో విశిష్టత

ఉంటుంది. సిట్రస్ ఫలాలతో పాటు ప్రతీ పండు మీ పాత్రలో ఉంటేనే శరీరానికి కావాల్సిన అన్ని విటమిన్లు సరిగ్గా అందుతాయి.

వీటన్నింటినీ ఆహారంలో భాగం చేసుకుంటే సగం చర్మ సమస్యలు మీ దరి చేరవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version