తెలంగాణలో బోనాల పండుగ.. తేదీ ఖరారు!

-

తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి తలమానికంగా భావించే బోనాల పండుగ ఉత్సవాలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు బోనాల పండుగ వేడుకలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఉత్సవాల తేదీలను ఖరారు చేశారు. ఈ క్రమంలో ఆషాడ బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఈ నెల 30వ తేదీన గోల్కొండ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

తెలంగాణ-బోనాలు

ఈ నెల 30న గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించడంతో ఆషాడ బోనాలు ప్రారంభం అవుతాయన్నారు. జులై 17వ తేదీన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు, జులై 18న రంగం, భవిష్యవాణి కార్యక్రమాలు, జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాల ఊరేగింపు, జులై 28న గోల్కొండ బోనాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని మంత్రులు పేర్కొన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల పండుగను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version