తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు.. ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చిందట..!

-

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో..చాలా ముఖ్యమైన ఘట్టం. కానీ ఈరోజుల్లో.. మానవసంబంధాలు గాడితప్పాయి..ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోయాయి, వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. కన్న తండ్రే కూతుర్ని అత్యాచారం చేస్తున్నాడు..మన దగ్గర ఇది నేరం..కానీ ఓ యువతి తండ్రినే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. విచిత్రంగా ఉంది.. అమెరికాలోని లాస్ వెగాస్‌లో నివసించే క్రిస్టీ అనే యువతి తన సవతి తండ్రిని పెళ్లాడింది. ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. క్రిస్టీ వివాహం చేసుకున్న వ్యక్తి ఆమె తల్లి మాజీ భర్త. అంటే సవతి తండ్రి. అతడిని చూడగానే ప్రేమలో పడిందట… తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకుని భార్యాభర్తలుగా బంధం ఏర్పరచుకున్నారు ఇటీవల క్రిస్టీ.

సవతి తండ్రితో వివాహం తన జీవితంలో అతి పెద్ద నిర్ణయమని, తాను అదృష్టవంతురాలిని అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.. మహిళ పెట్టిన ఈ ప్రకటన సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఆ తర్వాత ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తన వివాహం తర్వాత వేడుక ఫొటోలను షేర్ చేయడంతో పాటు #MarryYourMomsEx అనే వీడియోను కూడా క్రిస్టీ షేర్ చేసింది. తన తల్లిని మోసం చేయడం ప్రపంచంలోనే అత్యుత్తమ నిర్ణయంగా భావించి భర్తగా మారిన తన తండ్రితో చాలా సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చంది. మరోవైపు తన తల్లితో కూడా తనకు ఇప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయని, ఆమెతో మాట్లాడుతూనే ఉన్నట్లు క్రిస్టీ తెలిపింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పోయే కాలం వస్తే ఇలాంటి పనులే చేస్తారు అని కొందరు కామెంట్ చేస్తుండగా..విదేశాల్లో ఇలాంటి కామనే అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అక్కడ కాబట్టి.. ఈ విషయంపై ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.. అదే మన దేశంలో అయితే..ఇది ఎంత పెద్ద తప్పు.. నెటిజన్లు ఆడేసుకుంటారు. సమాజంలో తలెత్తుకోని తిరగలమా..? మన దేశంలో.. పరువుకు ఇచ్చే మర్యాద అలాంటిది..? ఇది కొన్ని సార్లు..కష్టంగా ఉన్నా.. అందరూ వారి వారి సరిహద్దుల వరకూ పరువు, మర్యాదలను కాపాడుకుంటూనే వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version