అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున తాము వైట్‌హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చిందని, అలా బయటికి వెళ్లిన తర్వాత అరగంటపాటు బాగా ఏడ్చానని అమెరికా మాజీ ప్రథమ మహిళ, మరో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా తెలిపారు. ది లైట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిషెల్ ఈ విషయం తెలిపారు. ఎనిమిదేళ్ల తర్వాత తాము ఇంటిని విడిచిపెట్టాల్సి రావడం తమకు ఎంతో వేదన కలిగించిందని చెప్పారు.
ఎనిమిదేళ్ల అనుబంధం తమకు వైట్ హౌస్‌తో ఉన్నదని, అది తమ పిల్లలకు ఊహ తెలిసిన తర్వాత ఏకైక ఇల్లని, ఆ ఇంటిని విడిచిపెట్టాల్సి వచ్చిన రోజున చాలా ఉద్వేగానికి లోనయ్యానని ఆమె తమ బాధని వ్యక్తపరిచారు. మా పిల్లలు చికాగోను స్వస్థలంగా గుర్తుంచుకున్నా వారు అక్కడికంటే ఎక్కువ సమయం వైట్‌హౌస్‌లోనే గడిపారని అన్నారు. ఇంటితోపాటు ఆ ఇంట్లో తమతో కలిసి ఉన్న సిబ్బందిని కూడా తాము వదిలిపెట్టాల్సి రావడం చాలా బాధగా అనిపించిందని వెల్లడించారు. ‘ఆ రోజు నాలో కన్నీళ్లు ఆగలేదు. వేదికపై కూర్చున్న మాకు ఎదురుగా ఉన్న స్క్రీన్‌పై మేము కనిపిస్తున్నట్లు ఆమె తెలిపారు.