కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పుడు మన దేశంలో రెస్టారెంట్, హోటల్స్ ని మూసి వేసారు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో కేంద్రం షరతులతో కూడిన అనుమతులను మాత్రమే ఎక్కువగా ఇస్తుంది. ఈ తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం హోటళ్ళు మరియు రెస్టారెంట్లలో మద్యం సేవించడానికి అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం సేవించడానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్న యూనిట్లకు మాత్రమే ఈ అనుమతి మంజూరు చేసింది.
అయితే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన అన్‌లాక్ 3 మార్గదర్శకాల ప్రకారం, ప్రస్తుతం బార్‌లు పనిచేయడానికి అనుమతించబడవు అని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. ఢిల్లీలో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయి. అక్కడ కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గింది. కరోనా వైరస్ తగ్గు ముఖం పట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.