కరోనా లాక్ డౌన్ వేళ విద్యార్ధులు చదువులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో చదువులు నష్టపోకుండా విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసులను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్ట్ కీలక ఆదేశాలు ఇచ్చింది. కరోనా సమయంలో ఆన్‌లైన్ తరగతుల కోసం గాడ్జెట్లు, పేద పిల్లలకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించాలని ఢిల్లీ హైకోర్ట్ హైకోర్టు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలను ఆదేశించింది.
ఆన్ లైన్ తరగతుల కోసం పేద పిల్లలకు గాడ్జెట్లు, ఇంటర్నెట్ ప్యాకేజీని అందించాలని కేంద్రీయ విద్యాలయాల కింద ఉండే ప్రభుత్వ పాఠశాలలను కూడా ఆదేశించింది హైకోర్ట్. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు రాష్ట్రానికి చెందిన పేద పిల్లలకు గాడ్జెట్లు, ఇంటర్నెట్‌ను అందించినందుకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చని హైకోర్టు తెలిపింది. కాసేపటి క్రితం ఈ తీర్పు ఇచ్చింది హైకోర్ట్.