పెరుగుతున్న కరోనా కేసులు, ప్రైవేట్ ఆస్పత్రులకు హైకోర్ట్ కీలక ఆదేశాలు

-

దేశ రాజధానిలో వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రాజధానిలోని 33 ప్రైవేట్ ఆసుపత్రులను… కరోనా సోకిన రోగులకు 80 శాతం పడకలను కేటాయించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఉత్తర్వులు రెండు వారాల పాటు అమలులో ఉంటాయి అని నవంబర్ 26 న, ఈ ఉత్తర్వును మరోసారి సమీక్షిస్తామని హైకోర్ట్ పేర్కొంది.

కరోనావైరస్ రోగులకు కేటాయించిన 80 శాతం ఐసియు పడకల విషయంలో జాగ్రత్తగా ఉంచాలని ఇతర రోగులకు కేటాయించిన 20 శాతం పడకలను వేరుగా ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది. వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో రాష్ట్ర సర్కార్ తీసుకున్న చర్యల గురించి మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలో కరోనా మూడో దశలో ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news