హైదరాబాద్‌ లో దారుణం..రెండో భర్తతో భార్య రొమాన్స్‌, పెట్రోల్ పోసి నిప్పంటిచిన మొదటి భర్త !

-

హైదరాబాద్‌ లోని నారాయణగూడ లో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై పెట్రోల్‌ పోసాడు ఓ భర్త. నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను వదిలేశాడు. కొద్ది రోజులుగా వారి మధ్య గొడవ కావడంతో, ఆమెను వదిలేశాడు. అయితే, నిన్న రాత్రి నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఆ మహిళ రెండో భర్తతో కనిపించడంతో వారిపై పెట్రోల్ పోసిని నిప్పంటించాడు మొదటి భర్త.

కొన్ని సంవత్సరాలుగా మొదటి భర్తకు దూరంగా ఉంటూ మరొక వివాహం చేసుకొని ఒక బాబుతో ఉంటోంది ఆ మహిళ. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇక స్థానికులు బాధితులను గాంధీ హాస్పిటల్ కి తరలించారు. చిన్న బాబు 40 శాతం పైగా కాలిపోవడంతో పరిస్థితి సీరియస్ గా ఉంది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version