ఇండియాలోనే మొదటి అరుదైన శస్త్ర చికిత్స.. రోగి చెవిలో నిరంతరం శబ్దం వినిపించేదంట..?

-

చెన్నైకి చెందిన వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను చేశారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ కేసుకు సంబంధించిన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యులు తెలిపారు. రెండేళ్లుగా అరుదైన టిన్నిటస్ వ్యాధితో బాధపడుతున్న వెంకట్ (26 ఏళ్లు) అనే వ్యక్తికి ఈ పరీక్షలు నిర్వహించారు. టిన్నిటస్ అనగా.. చెవి లోపల నిరంతరం రింగింగ్ వంటి శబ్దాలు వినిపించడం. అయితే చెన్నై వైద్యులు మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ (ఎంవీడీ) ఆధారంగా శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు వారు తెలిపారు.

team-surgery

రెండేళ్లుగా వెంకట్ టిన్నిటిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి 2019 ఏప్రిల్ నెలలో ప్రారంభమమైంది. అప్పటి నుంచి తరచూ అతడి చెవిలో శబ్దాలు, సంగీతం వంటివి వినిపించేవి. దీంతో అతడికి నిద్ర కూడా వచ్చేది కాదు. చదువుపై, ఎలాంటి పనిపై కూడా దృష్టి పెట్టలేకపోయేవాడు. ఈ మేరకు వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. చెవిలో వస్తున్న శబ్దాన్ని తగ్గించేందుకు ప్రత్యాన్మయ మార్గాలను వెతికేవాడు. చెవి వెనుక టేబుల్ ఫ్యాన్ ఉంచి.. అలా కొంచెం నిద్రపోవడానికి ప్రయత్నించేవాడు.

వెంకట్ చాలా మంది ఈఎన్‌టీ వైద్యులను కలిసిన.. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ అర్థం అయ్యేది కాదు. వెంకట్‌కు వినికిడి శక్తి బాగానే ఉన్నా.. చెవి లోపల మాత్రం వేరే శబ్దాలు వినిపించేవి. చివరికీ ఎంజీఎం హెల్త్‌కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్సెస్ అండ్ స్పైనల్ డిజార్డర్స్ డైరెక్టర్, గ్రూప్ హెడ్ డాక్టర్ కే.శ్రీధర్‌ సంప్రదించాడు. తన సమస్య గురించి పూర్తిగా తెలిపాడు. ఈ మేరకు డాక్టర్ శ్రీధర్.. వెంకట్‌ను పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత టిన్నిటస్ వ్యాధితో బాధపడుతున్నాడని గుర్తించారు. ఇది చాలా అరుదైన వ్యాధి అని, టిన్నిటస్ వ్యాధి వల్ల చెవి లోపల నిరంతరం శబ్దం వినిపిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం 50 కన్నా తక్కువ కేసులు ఉన్నాయని, ఇండియాలో ఇదే మొదటి కేసు అని డాక్టర్ శ్రీధర్ తెలిపారు.

ఈ మేరకు డాక్టర్ శ్రీధర్.. వెంకట్‌కు మైక్రోవాస్కులర్ డీక్రంప్రెషన్ అనే ప్రత్యేక శస్త్ర చికిత్సను ప్రారంభించారు. ఈ ప్రక్రియను ట్రైజెమినల్ న్యూరాలజిస్ట్ (నరాల కదలికకు ముఖంపై షాక్ వంటి నొప్పి) చికిత్సను క్రమం తప్పకుండా చేసేవారు. అలా భారతదేశంలోనే మొదటిసారిగా టన్నిటస్ చికిత్సలో ఎంవీడీని విజయవంతంగా ఉపయోగించారు. ఈ మేరకు డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ… శ్రవణ నాడిని ప్రేరేపించే ధమని వల్ల వెంకట్ చెవిలో నిరంతరం శబ్దం వచ్చేది. ఈ సమస్య ఇలాగే ఉంటే రోగి మానసిక స్థితిని కోల్పోతాడని, ముఖ సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ చికిత్స విజయవంతమైందని, వెంకట్ క్షేమంగా ఉన్నాడని ఆయన తెలిపారు. ఈ మేరకు వెంకట్ ఎంజీఎం హెల్త్‌కేర్ డాక్టర్ శ్రీధర్, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version