గుడ్ న్యూస్: చైనా వ్యాక్సిన్ సక్సెస్…?

చైనాలో తయారు చేసిన సినోవాక్ కరోనావైరస్ వ్యాక్సిన్ బ్రెజిల్లో నిర్వహిస్తున్న చివరి దశ హ్యూమన్ ట్రయల్స్ లో విజయవంతం అయిందని ప్రకటన చేసారు. ఇది సురక్షితంగా మంచి ఫలితాలను ఇచ్చిందని క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న బ్రెజిలియన్ ఇన్స్టిట్యూట్ ప్రకటన చేసింది. ఇక మూడవ దశ ట్రయల్స్‌లో ఉన్న రష్యన్ కరోనావైరస్ వ్యాక్సిన్, స్పుత్నిక్ వీ ప్రస్తుతం నవంబర్‌ లో 10,000 మంది వాలంటీర్ల డేటాను పంచుకోనుంది.

ప్రపంచవ్యాప్తంగా, 44 కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారిదారులు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నారు, మరో 154 వ్యాక్సిన్ లు అభివృద్ధి చేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. సినోవాక్ బయోటెక్ యొక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న బ్రెజిలియన్ ఇన్స్టిట్యూట్, చివరి దశ ట్రయల్స్ లో సానుకూల విరుగుడు ఫలితాలను చూపించిందని తెలిపింది. 9 వేల మందికి టీకా ఇవ్వగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని చెప్పింది. 20% వాలంటీర్లు ఇంజెక్షన్ నుండి తేలికపాటి నొప్పిని చెప్పగా… 15% మంది మోతాదు ఇచ్చిన తర్వాత తలనొప్పి ఉందని చెప్పారు.