గవర్నర్ బిజెపి కార్యకర్తగా పనిచేస్తున్నారు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ తమిళిసై ఓ బిజెపి కార్యకర్త లాగా పనిచేస్తున్నారని విమర్శించారు. గవర్నర్ పదవి కంటే సీఎం పోస్టుకే పవర్ ఎక్కువ ఉంటుందని అన్నారు. గవర్నర్ పదవి ఓ నామినేటెడ్ పోస్ట్ అన్న జగ్గారెడ్డి.. ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యుడు పదవితో గవర్నర్ పదవి సమానమని వ్యాఖ్యానించారు.

jaggareddy | జగ్గారెడ్డి

కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే.. వాళ్లే గవర్నర్ గా ఉంటారని అన్నారు. ఇక్కడి ప్రభుత్వం టిఆర్ఎస్, గవర్నర్ బిజెపి కాబట్టి ఈ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అయితే తెలంగాణ గవర్నర్ గా మూడేళ్ల పదవి కాలాన్ని ముగించుకున్న నేపథ్యంలో గురువారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై మీడియా సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలకు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జగ్గారెడ్డి.. గవర్నర్ పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version