పిల్లల్లో ముదురుతున్న HFMD వ్యాధి..లక్షణాలు ఇవే..

-

ఈ రోజుల్లో ఎప్పుడో ఏ వైరస్‌ వస్తుందో తెలియడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా రోగాల భారనపడక తప్పడం లేదు. కరోనా, మంకీపాక్స్‌, టమోటా ఫీవర్‌ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే ఈ వ్యాధులనుంచి తప్పించుకోగలం లేదంటే అంతే సంగతులు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లల్ని రోగాల నుంచి కాపాడుకోవడం చాలా ముఖ్యం. వారికి వచ్చే మరో వ్యాధి HFMD అంటే హ్యాండ్ ఫుట్ అండ్ మౌత్ డీసీజ్. ఇది ఎక్కువగా పిల్లల్లోనే వస్తుందని. వైద్యులు అంటున్నారు. ఏడు నుంచి పది రోజుల పాటు ఈ వ్యాధి లక్షణాలు ఉండి చిన్నారులను ఇబ్బందికి గురి చేస్తుంది. ఈరోజు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటో చూద్దాం.

అసలు ఈ HFMD ఏంటి?

ఇది ఒక సాధారణ వైరల్ ఫీవర్ లాంటిది. ఎక్కువగా పిల్లల్లోనే వస్తుంది. తుమ్ములు, వ్యాధి సోకిన పిల్లలను ముట్టుకోవడం, వారి మలాన్ని పట్టుకోవడం వంటి వాటి ద్వారా వైరస్ ఇతరులకి వ్యాప్తి చెందుతుంది. ఐదేళ్లకంటే తక్కువ వయసు ఉన్న పిల్లల మీదే దీని ప్రభావం అధికంగా ఉంటుంది. పెద్ద వాళ్ళకి కూడా ఇది సోకే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది కానీ చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల త్వరగా దాని బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కారణాలు ఏంటి..?

HFMD అనేది కాక్సాకీ వైరస్ జాతి వలన సంభవిస్తుంది. చేతులు కడుక్కోకుండా ఉండటం, వైరస్ ఉన్న ప్రదేశాలను తాకడం. డైపర్లు మార్చేటప్పుడు, వ్యాధి సోకిన పిల్లల మలం శుభ్రం చేసిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోకుండా ఆ హ్యాండ్స్ కళ్ళు, ముక్కు, నోటిని తాకడం వల్ల ఇది వ్యాపి చెందుతుంది. వైరస్ సోకిన పిల్లలు పట్టుకున్న తలుపు గడియలు పట్టుకోవడం, బొమ్మలు తాకడం వంటివి చేసినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్‌కి గురయ్యే అవకాశం ఉంది. ఇది చాలా ఈజీగా సోకే అంటువ్యాధి.

లక్షణాలు..

ఈ వ్యాధి లక్షణాలు గొంతు నొప్పి, జ్వరం, ముక్కు కరటం, ఆకలి తగ్గడం, చిరాకు, తలనొప్పి, శరీరంపై ఎర్రటి బొబ్బలు, దద్దుర్లు ఉంటాయి. ఇవే కాదు నోటీలో బొబ్బలు, చేతులు, అరికాళ్ళపై ఎర్రటి దద్దుర్లు రావడం చీము కారడం కూడా జరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు చెప్తున్నారు. జ్వరం వచ్చిన ఒకటి రెండు రోజుల తర్వాత ఇటువంటి ఎర్రటి బొబ్బలు రావడం జరుగుతుందని అంటున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన మూడు నుంచి ఆరు రోజులు తర్వాత లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. జ్వరం, గొంతు నొప్పి HFMD ప్రధాన లక్షణాలు. బొబ్బలు మూడు రోజుల తర్వాత మొదలవుతాయి. చూసేందుకు ఇది కూడా టమోటో ఫీవర్‌లానే ఉంటుంది టమోటో ఫ్లూ అనేది HFMD క్లినికల్ వేరియంట్‌గా నిపుణులు నిర్ధారించారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

ఇన్ఫెక్షన్ సోకిన వారీ దుస్తులు, తినే పాత్రలు వేరుగా ఉంచాలి.
దుస్తులు క్రమం తప్పకుండా వేడి నీటితో శుభ్రం చెయ్యాలి.
ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన దద్దుర్లని వేడి నీటితో శుభ్రం చెయ్యాలి.
వారీ శరీరం ఎప్పుడు హైడ్రేట్ గా ఉండేలా చూసుకోవాలి.
నోటిలో వచ్చే పుండ్లు వల్ల వ్యయాలు తినలేరు, తాగలేరు. కానీ శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉండటం కోసం ద్రవపదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి.
జ్వరం అదుపులో ఉండటానికి పారాసిటమాల్ వినియోగించాలి.
ఏడు నుంచి పది రోజుల్లో ఈ లక్షణాలు తగ్గకపోతే వెంటనే వైద్యులని సంప్రదించాలి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version