తెలంగాణలోని మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇవాళ పర్యటించనున్నారు. రాజ్ భవన్ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా మెదక్ కలెక్టరేట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి మెదక్ చర్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొంటారు. అనంతరం కుల్చారం రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముఖా ముఖిలో పాల్గొననున్నారు గవర్నర్. విద్యార్థులతో కలిసి గవర్నర్ లంచ్ చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్ కి బయలుదేరనున్నారు.
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మెదక్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గవర్నర్ రాక ప్రారంభం నుంచి తిరిగి వెళ్లే వరకు షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసారు కలెక్టర్.