అమెరికాలో అద్దె ఇండ్ల‌కు పెరుగుతున్న డిమాండ్‌.. కార‌ణం అదే

-

ఎక్క‌డైనా అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారాల‌నుకుంటారు. కానీ ఓ చోట మాత్రం సొంత ఇంటి నుంచి అద్దె ఇంట్లోకి మారుతున్నారు. ఒక‌రిద్ద‌రు కాదండోయ్‌.. ల‌క్ష‌లాది మంది ఇలాగే చేస్తున్నారు. అయితే అదేదో పేద దేశంలోనే లేదంటే పేద ప్రాంతంలోనో కాదండోయ్‌.. అగ్ర రాజ్యంగా పిలుస్తున్న అమెరికాలో. క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇలాగే అమెరికాలో ఊహించ‌ని పరిణామాలు జ‌రుగుతున్నాయి. ఈ ప్ర‌భావాలు అక్కడి మధ్యతరగతి ప్ర‌జ‌ల‌తో పాటు ఆ దేశానికి వ‌ల‌స వెళ్లిన వారికి కూడా ఎదుర‌వుతుండ‌టం ఇప్పుడు గ‌మ‌నార్హం.

america-rent-houses

ఎందుకంటే చాలామంది ఇత‌ర దేశాల నుంచి డాల‌ర్ డ్రీమ్స్‌లో భాగంగా అమెరికాలో ఉద్యోగం కోంస వెళ్తున్నారు. ఇక ఇలాంటి వారంద‌రికీ కూడా అమెరికన్లకే అద్దె ఇల్లు దొరకటం పెద్ద సమస్యగా మారుతోంది. వీరితో పాటు ఇప్పటి వ‌ర‌కు అమెరికాలో సొంతింట్లో ఉన్న వారు కూడా త‌మ ఇండ్ల‌ను విడిచిపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే అమ్మేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇలా జరిగిందంటే దారికి కార‌ణం మాత్రం కరోనా మహమ్మారి అని తెలుస్తోంది.

ఈ క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత అమెరికాలో వ్యక్తిగత జీవితాల‌తో పాటు అక్క‌డి ప్ర‌జ‌ల‌కు సంబంధించిన ఆర్ఠిక పరిస్థితి కూడా దారుణంగా దెబ్బ తీయటం తెలిసిందే. ఇక క‌రోనా వ‌ల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు సొంతింటిని మెయింటేన్ చేయ‌లేక చివ‌ర‌క అమ్మేస్తున్నారంట‌. అది కూడా ఎక్కువ‌గా టంపా అలాగే ఫ్లోరిడాతోపాటు టూ మెంఫిస్, టెన్నస్సీ, రివర్ సైడ్ లాంటి ఏరియాల్లోనే ఈ అద్దె ఇండ్ల వ్య‌వ‌హారం ఎక్కువ‌గా సాగుతోంది. దీంతో అక్క‌డ ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. గడిచిన మూడు నెలల కాలంలో ఇది చాలా అత్య‌ధికంగా అంటే దాదాపు లక్షలకు పైగా అద్దె ఇళ్లల్లోకి మారిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version