కోడలిపై కన్నేసిన భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు!

-

భద్రాచలం ఆలయ అర్చకులపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరాల్లోకివెళితే.. భద్రాచలం ఆలయ ప్రధానార్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులుకు కుమార్తెలు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో వెంకట సీతారాంను కొన్నేళ్ల కిందట దత్తత తీసుకొని భద్రాచలం ఆలయ అర్చకుడిగా ఉద్యోగం ఇప్పించాడు.

అయితే, వెంకట సీతారాంకు తాడేపల్లిగూడెంకు చెందిన యువతితో 2019లో పెళ్లి జరిపించాడు. పెళ్లి జరిగిన కొన్ని నెలలకే సీతారాం వరకట్నం ఎక్కువగా తేవాలని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఆమెపై మామ సీతారామానుజాచార్యులు కన్నేశాడు. తనకు కుమారులు లేరని, తన పోలికలతో ఒక బాబును కని ఇవ్వాలని కోడలిపై సీతారామానుజాచార్యులు లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పగా అతను తిట్టి సీతారామానుజాచార్యులు అలాంటి వాడు కాదని, భార్యతోనే తండ్రికి క్షమాపణ చెప్పించాడు. దీంతో బాధితురాలు ఆగస్టులో తాడేపల్లిగూడెం పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టగా..తండ్రీకొడుకులను దేవాదాయశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news