హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ పై నెటిజన్ అసభ్యకర కామెంట్.. ఆ నటి ఏంచేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. ?

-

హీరోయిన్స్ అంటే ఏదో ప్రత్యేక లోకం నుండి ఊడిపడిన వారు కాదు.. మన మధ్య ఉండే మనుషులే.. వారికి మనసు ఉంటుంది. తెరపై అందాలు ఆరబోస్తున్నారని వారిని అలుసుగా చూస్తే వారికి కలిగే బాధ వేరుకాదు.. మన ఇంటిలోని ఆడపిల్లను ఎవరైనా ఏమైనా అంటే మనం పడే బాధ వేరు కాదు.. మనసుకు కలిగే వేదన ఎవరికి అయినా ఒకటే.. ఇక ఈ మధ్య కాలంలో మనుషుల బుద్ధి మరీ గడ్దితింటుంది.. ఇకపోతే కొందరైతే సోషల్ మీడియాలో హీరోయిన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.. ఇలాగే ప్రవర్తించిన ఓ నెటిజన్‌కు మలయాళ హీరోయిన్ అపర్ణా నాయర్ అతని ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను, ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది.

ఇకపోతే ఫేస్‌బుక్ పేజీలో ఇటీవల తన కెరీర్ గురించి అపర్ణా నాయర్ ఓ కామెంట్ పెట్టిందట. దీనిపై స్పందించిన సదరు నెటిజన్ ఐ లవ్యూ అంటూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ గురించి అసభ్యకర కామెంట్ చేయగా, అసహానికి గురైన అపర్ణా నాయర్ అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని, డియ‌ర్ అజిత్‌ కుమార్.. మీ ప్రొఫైల్ చూస్తే మీకూ ఒక కూతురు ఉంద‌ని అర్థ‌మైంది. మీరు మీ కుమార్తెను ప్రేమ‌గా ఆలింగ‌నం చేసుకున్న ఫొటోను చూశాను. అదే విధంగా నేను కూడా ఓ తండ్రికి కూతుర్నే. ఇలాంటి అస‌భ్య‌క‌ర కామెంట్స్ పెట్టే ముందు ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి అని ఘాటుగా రిప్లై ఇచ్చిందట..

 

దెబ్బకు గురుడికి దిమ్మతిరిగి బొమ్మకనబడిందట.. ఇకపోతే అపర్ణ మాట్లాడుతూ, ఒక‌వేళ నేను ఇలాంటి కామెంట్స్‌పై స్పందించ‌క‌పోతే మీరు మ‌రోలా అర్థం చేసుకునే అవ‌కాశం ఉంది. కాబట్టి ఈ విధంగా స్పందించవలసి వచ్చిందని పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news