చరిత్ర సృష్టించిన భారత ఫుట్‌బాల్ జట్టు

-

భారత ఫుట్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఏఎఫ్‌సీ ఆసియా కప్‌కు రెండోసారి అర్హత సాధించింది. ఇలా రెండు పర్యాయాలు టోర్నీలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఫిలిపిన్‌పై పాలస్తీనా 4-0 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ ఈ ఘనత సాధించింది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో హాంకాంగ్ జట్టుతో ఓడిపోయినా.. క్వాలిఫై మ్యాచ్ మీద ఎలాంటి ప్రభావం చూపదు. దీంతో ఈ టోర్నీకి భారత జట్టు ఐదోసారి అర్హత సాధించింది. 1964లో భారత్ తొలిసారిగా ఏఎఫ్‌సీ టోర్నీలో పాల్గొంది. ఆ తర్వాత 1984, 2011, 2019 టోర్నీల్లో పాల్గొంది.

భారత ఫుట్‌బాల్ జట్టు

ఏఎఫ్‌సీ ఆసియా కప్ క్వాలిఫైలో మూడో రౌండ్‌లో భారత్ తమ తొలి రెండు మ్యాచ్‌లు కంబోడియా, ఆప్ఘనిస్తాన్‌తో ఆడి గెలిచింది. కంబోడియాపై భారత్ 2-0తో గెలుపొందింది. సునీల్ ఛెత్రీ జట్టు 2-1తో ఆప్ఘనిస్తాన్ జట్టును చిత్తు చేసింది. కంబోడియాపై సునీల్ ఛెత్రీ రెండు గోల్స్ చేశాడు. అదే సమయంలో ఆప్ఘనిస్తాన్‌పై ఛెత్, సహల్ అబ్దుల్ సమద్ స్కోర్ చేశారు. దీంతో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి ఇప్పుడు 128 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 83 గోల్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version