లో బడ్జెట్ సినిమాగా బాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. 1990లో కాశ్మీర్లో పండిట్లపై జరిగిన అరాచకాలు, అత్యాచారాలు, వలసలు ప్రధాన కథాంశంగా డైరెక్టర్ వివేక్ అగ్రహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఇదిలా ఉంటే కలెక్షన్ల విషయంలో దూసుకుపోతోంది ‘ ది కాశ్మీర్ ఫైల్స్’.
మార్చి 11న విడుదలైన ఈసినిమా 8వ రోజు కూడా రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. రూ.19.15 కోట్లు వసూలు చేసింది. బాహుబలి2 (రూ.19.75 కోట్లు)కు సమానంగా వసూలు చేసింది. దంగల్ (రూ.18.59) కోట్ల కంటే ఎక్కువగా కాసుల పంట కురిపించింది. మొత్తంగా రూ.116.45 కోట్లు వసూలు చేసింది. దేశవ్యాప్తంగా ‘ ది కాశ్మీర్ ఫైల్స్’ కు వస్తున్న క్రేజ్ తో ఆ సినిమాను తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లోకి కూడా డబ్బింగ్ చేయనున్నట్లు ప్రకటించించారు మూవీ మేకర్స్.