ధనుష్ రాయన్ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్

-

ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న 50వ సినిమా రాయన్.ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాలో సందీప్ కిషన్ ,దుసారా విజయన్, కాళిదాస్ జయరామ్, ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో చిత్రం విడుదల కానుంది.నార్త్ చెన్నై కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రేలర్ ను మేకర్స్ విడుదల చేశారు.రాయాన్ లుక్లో ధనుష్ రక్తంతో తడిచిన చేతితో పిడికిలి బిగించి భీకరంగా కనిపిస్తు చేతిలో కత్తులు ఉండటంతో అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో ఈ మూవీ విడుదల కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ట్రైలర్ లో రెహమాన్ తనదైన రస్టిక్ స్టైల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news