హనీమూన్‌కు ఫేవరెట్‌ స్పాట్‌ అయిన మాల్దీవుల్లో విడాకుల రేటు కూడా ఎక్కువే

-

ఇప్పుడు మాల్దీవుల గురించి యావత్‌ దేశం మాట్లాడుకుంటోంది.. మాల్దీవుల పర్యటనలు ఇండియన్స్‌ రద్దు చేసుకుంటున్నారు. ఆర్థిక దెబ్బతో బెదిరింపులకు గురైన మాల్దీవులు.. భారత్‌ను విమర్శించిన మంత్రిని సస్పెండ్ చేసింది. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. మాల్దీవులు ప్రముఖంగా హనీమూన్ స్వర్గంగా పేరుగాంచింది.. కొత్త జంటలు, ప్రేమ పక్షులు తరచుగా మాల్దీవులలో కొంత సమయం గడపడానికి ఇష్టపడతారు. అయితే మాల్దీవుల్లో విడాకుల శాతం ఎక్కువగా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రపంచంలో అత్యధిక విడాకుల రేటు ఉన్న దేశాలలో మాల్దీవులు మొదటి స్థానంలో ఉంది.
honeymoon destinations in india
ప్రపంచంలోనే అత్యధిక విడాకుల రేటు మాల్దీవుల్లో ఉంది. ఇక్కడ 1000 మందిలో 5.5 విడాకుల కేసులు నమోదయ్యాయి. పరిస్థితి, సందర్భం, సంబంధం, ఆర్థిక వ్యవస్థ, మనస్తత్వం, అనుకూలత వంటి అనేక కారణాలు ఉన్నాయి. దీనికి తోడు నిపుణుల అభిప్రాయం ప్రకారం, మాల్దీవుల ప్రభుత్వ వివాహం మరియు కుటుంబ విధానం కూడా కారణం.
ప్రపంచంలోని టాప్ 10 విడాకుల దేశం
మాల్దీవులు; గౌమ్ విడాకుల రేటు 1,000కి 5.5
రష్యాలో విడాకుల రేటు 1,000కి 4.3 ;
మోల్డోవా విడాకుల రేటు 1,000కి 3.9
బెలారస్ విడాకుల రేటు 1,000కి 3.8
చైనాలో విడాకుల రేటు 1,000కి 3.7 ;
అరుబా విడాకుల రేటు 1,000కి 3.2
జార్జియాలో విడాకుల రేటు 1,000కి 2.9
ఉక్రెయిన్ విడాకుల రేటు 1,000కి 2.9
కోస్టా రికాలో విడాకుల రేటు 1,000కి 2.9 ప్రతి 1,000 మందికి 2.8 విడాకుల రేటు ఉంది.  ఆశ్చర్యంగా ఉంది కదూ.. హనిమూన్‌కు పేరుగాంచిన మాల్దీవుల్లో విడాకుల రేటు ఎక్కువ అంటే.. ఇది ఇప్పుడు కొంతమంది సెంటిమెంట్‌గా తీసుకునే అవకాశం కూడా ఉంది. కొత్తగా పెళ్లై అక్కడికి ఎందుకు వెళ్లడం అని అనుకునే ఛాన్స్‌ లేకపోలేదు. మొత్తానికి మాల్దీవుల పరిస్థితి మారిపోయింది. అందుకే అంటారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అని..!

Read more RELATED
Recommended to you

Latest news