బర్గర్ తినడానికి హెలికాప్టర్ బుక్ చేశాడు.. చివరికి ఎంత ఖర్చు అయిందో తెలుసా..!?

-

ఈ మధ్య కాలంలో అందరూ కూడా బర్గర్లు పిజ్జాలు తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అనే విషయం తెలిసిందే. పక్కనే ఉన్న షాప్ వద్దకు వెళ్లి బర్గర్ తినడానికి ఆసక్తి చూపుతుంటారు. లేదా మొబైల్ లో బర్గర్ ఆర్డర్ చేసుకొని డోర్ డెలివరీ పొంది ఇంట్లో కూర్చుని హాయిగా బర్గర్ తినడానికి ఆసక్తి చూపుతుంటారు నేటి రోజులలో జనాలు. కానీ ఎక్కడో ఒక వ్యక్తి మాత్రం ఏకంగా బర్గర్ తినడం కోసం 725 కిలోమీటర్లు ప్రయాణించాడు.

అది కూడా బైక్ పైనో లేదా కారులోనూ అనుకుంటే మాత్రం పొరబాటే బర్గర్ తినడం కోసం 725 కిలోమీటర్లు ప్రయాణించడం కోసం ఏకంగా ఒక హెలికాప్టర్ని బుక్ చేసుకున్నాడు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. రష్యాలోని ఒక మిలియన్ ఇలా బర్గర్ తినడం కోసం హెలికాప్టర్ బుక్ చేసుకున్నాడు. విక్టర్ అనే వ్యక్తి అతని గర్ల్ ఫ్రెండ్ క్రిమియా తో హాలిడే వెకేషన్ కు వెళ్ళాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ఆహారం తిని బోర్ కొట్టడంతో బర్గర్ తినాలి అని అనుకున్నాడు ఇక చుట్టుపక్కల ఎక్కడా బర్గర్ షాప్ లేకపోవడంతో ఏకంగా హెలికాఫ్టర్ బుక్ చేసి రెండు లక్షల రూపాయలు వెచ్చించి.. 725 కిలోమీటర్లు ప్రియురాలితో ప్రయాణించి బర్గర్ తిన్నాడు సదరు వ్యక్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version