అతిపెద్ద ఫర్నిచర్ షోరూం ఐకియా ఇటీవలే తమ కస్టమర్లను కి గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో ఇప్పటికే ఒక ఫర్నిచర్ స్టోర్ ప్రారంభించిన ఐకియా ఇక ఇప్పుడు రెండో యూనిట్ కూడా నెలకొల్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత్లో ఐకియా సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం భారత్ లో రెండవ అతి పెద్ద స్టోర్ స్థాపించేందుకు నిర్ణయించుకున్న ఐకియా ఎంతో మంది ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఎంతోమంది కస్టమర్లు ఐకియా స్టోర్ ద్వారా ఎన్నో సేవలు పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఐకియా దేశంలో రెండవ యూనిట్ ను ముంబైలో నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇక ఈ నెల 18 నుంచి ముంబైలో ఐకియా షోరూం అందుబాటులోకి రానున్నట్లు ఇటీవలే సంస్థ ప్రతినిధులు తెలిపారు. నేవీ ముంబైలోని తానే బేలాపూర్ రోడ్డులో ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐకియా స్టోర్ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఐకియా స్టోర్ లో ఏడు వేల రకాల వస్తువులను తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచేందుకు సంస్థ నిర్ణయించింది అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం పరిమిత సంఖ్యలో కస్టమర్లకు మాత్రమే అనుమతిస్తాము అంటూ స్పష్టం చేశారు సంస్థ ప్రతినిధులు.