ఏపీ రాజధాని అమరావతి లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. వారికి ఏపీ గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపడంతో.. అమరావతిలో వాతావరణం ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిపోయింది. రైతులందరూ తీవ్ర ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోసారి రోడ్డెక్కిన రైతులు రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో ప్రభుత్వం తీసుకు రావడంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
ఈ క్రమంలోనే నేలపాడు లోని రైతు పూర్ణచంద్రరావు… సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ప్రభుత్వం మూడు రాజధానులు కు సంబంధించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తాను కిందికి దిగను అంటూ నిరసన చేపట్టారు. తమకు న్యాయం జరగాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే టవర్ దిగుతానని లేకుంటే దిగను అంటూ స్పష్టం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతును కిందికి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.