అంత‌రిక్షంలోకి స‌మోసాను పంపిన వ్య‌క్తి.. వైర‌ల్ వీడియో..!

-

అంత‌రిక్షంలోకి శాటిలైట్ల‌ను పంపితేనే సైంటిస్టులు అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. ఇక మ‌నుషులు, ఇత‌ర జంతువులు, వ‌స్తువుల‌ను పంపితే కొద్దిగా ఎక్కువ జాగ్ర‌త్త ప‌డాల్సి వ‌స్తుంది. కానీ ఆ వ్య‌క్తి మాత్రం ఇదంతా ఏమీ లేకుండానే సింపుల్‌గా స‌మోసాను అంత‌రిక్షంలోకి పంపించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. మూడో అటెంప్ట్‌లో స‌క్సెస్ సాధించాడు. కానీ ఆ ప్ర‌యోగం కూడా విఫ‌లం అయింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

యూకేలోని బేత్ అనే ప్రాంతంలో చాయ్ వాలా అనే ఇండియ‌న్ ఈట‌రీ ఉంది. దాని ఓన‌ర్ నీర‌జ్ గాధ‌ర్‌. అత‌నికి త‌న ఈట‌రీలోని స‌మోసాను అంత‌రిక్షంలోకి పంపాల‌నే విచిత్ర ఆలోచ‌న వ‌చ్చింది. ఇంకేముంది.. వెంట‌నే దాన్ని అమ‌లులో పెట్టేశాడు. హీలియం బెలూన్ల‌తో స‌మోసాను అంత‌రిక్షంలోకి పంపాడు. మొద‌టి సారి పైకి ఎగ‌ర‌కుండానే బెలూన్లు ఫెయిల‌య్యాయి. రెండో సారి బెలూన్ల‌లో త‌గినంత హీలియం లేదు. ఇక మూడోసారి ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది.

అయితే మూడోసారి బెలూన్ల ద్వారా స‌మోసాను అంత‌రిక్షంలోకి పంపినా ఆ బెలూన్లు చాలా ఎత్తుకు వెళ్లి త‌ర్వాత కింద ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో బెలూన్లు ఫ్రాన్స్‌లోని పికార్డీ అనే ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయ్యాయి. అయితే బెలూన్ల‌కు అమ‌ర్చిన కెమెరాలలో దాని ప్ర‌యాణం తాలూకు దృశ్యాలు రికార్డ‌య్యాయి. కానీ మ‌ధ్య‌లో కొంత సేపు ఆ కెమెరాలు కూడా ప‌నిచేయ‌లేదు. అలా నీర‌జ్ చేసిన మూడో ప్ర‌య‌త్నం కొంత మేర స‌క్సెస్ అయింది కానీ.. అది కూడా చివ‌ర‌కు ఫెయిలైంది. అయితే ఈ సంఘ‌ట‌న‌కు చెందిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version