Edupayala Temple : ఏడుపాయల వద్ద వనదుర్గమ్మ ఆలయం దగ్గర ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వనదుర్గమ్మ ఆలయాన్ని పూర్తిగా చుట్టేసి ప్రవహిస్తోంది మంజీరా నది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఇక ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం ఇలా వరద ముంపునకు గురికావడం కొత్తేమీ కాదు. వర్షం పడ్డప్పుడు అల్లా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ప్రతి వర్షాకాలం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది.
- జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గా భవానీ దేవాలయం
- ఆలయాన్ని చుట్టుముట్టిన మంజీరా నది
- వరద ప్రభావంతో ఐదో రోజు కూడా ఏడుపాయల ఆలయం మూసివేత
- రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు
- ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మరింత పెరిగిన మంజీరా నది ఉధృతి
- గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్న మంజీరా జలాలు
మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వనదుర్గమ్మ ఆలయాన్ని పూర్తిగా చుట్టేసి ప్రవహిస్తున్న మంజీరా నది pic.twitter.com/pWI5wCidT8
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2025