దేవునికి హారతి లో పచ్చ కర్పూరం ప్రత్యేకత..

-

పచ్చ కర్పూరం (ఎడిబుల్ కాంఫర్) అనేది పచ్చ కర్పూరం చెట్టు యొక్క వేర్లు కాండం ఆకులు, కొమ్మల నుండి డిస్లేషన్ పద్ధతిలో సేకరించే సుగంధ ద్రవ్యం. ఇది హారతి కర్పూరం నుండి భిన్నంగా ఉంటుంది. దీనిని ఆహార పదార్థాల ఉపయోగానికి ఎంతో సురక్షితమైనది. అంతేకాక ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది దీనిని సాధారణ వంటల్లో ఆయుర్వేద ఔషధాల్లో దేవుడికి హారతి ఇవ్వడంలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. అసలు మామూలు కర్పూరం కన్నా పచ్చ కర్పూరం ఎందుకు ప్రత్యేకమైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా కర్పూరం వెలిగించడం అందరికీ తెలిసిందే, కానీ పచ్చ కర్పూరం దేవుని ఎదుట ఉంచడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. హిందూ ఆచారాల ప్రకారం కర్పూరం దేవుని ఎదుట వెలిగించినప్పుడు అది భక్తుని అహంను  సమర్పించడం గా సూచిస్తారు. పచ్చ కర్పూరం సహజమైన స్వచ్ఛత కారణంగా ఈ ఆధ్యాత్మిక పూజలో మరింత పవిత్రంగా మారుస్తుంది. ఇలా పచ్చ కర్పూరం దేవుని ఎదుట వెలిగించడం నిస్వార్థ భక్తిని సూచిస్తుంది.

Spiritual Importance of Using Green Camphor in Worship
Spiritual Importance of Using Green Camphor in Worship

వేదాలు పురాణాల ప్రకారం కర్పూర హారతి జ్యోతి ఆత్మలోని దివ్యజ్ఞానాన్ని వెలిగిస్తుందని నమ్ముతారు పచ్చ కర్పూరం సుగంధం మనసును శాంతి పరిచి భక్తిని దేవుడి వైపు మళ్ళిస్తుంది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తుంది.

పచ్చ కర్పూరం లో  సుగంధం మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. ఇది ఆలయాలు లేదా ఇంటి పూజ మందిరాల్లో పవిత్రతను కాపాడడంలో సహాయపడుతుంది.

పచ్చ కర్పూరం హారతిలో ఉపయోగించడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. పచ్చ కర్పూరం వెలిగించినప్పుడు వెలుపడే సుగంధం గాలిలోని సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది. అందుకే ఎక్కువగా ఆలయాలలో పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. పచ్చ కర్పూరం సుగంధం మానసిక ఒత్తిడి ఆందోళన నిద్రలేమిని తగ్గిస్తుంది. శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హారతి సమయంలో ఈ సుగందాన్ని పీల్చడం ద్వారా భక్తులు ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

పచ్చ కర్పూరం ఆయుర్వేదంలో జలుబు, కఫం, చర్మ సమస్యలు చికిత్సగా ఉపయోగిస్తారు. ఇది యాంటీ సేఫ్టీ గుణాలను కలిగి ఉండి గాయాలను తొందరగా నయం చేస్తుంది.

హారతి సమయంలో ఒక లోహపు గిన్నెలో పచ్చ కర్పూరాన్ని ఉంచి దీపంతో వెలిగిస్తారు. ఇది దేవుడి ఎదుట వృత్తాకారంలో ఎడమ నుండి కుడికి తిప్పుతారు. హారతి అనంతరం భక్తులు ఈ జ్యోతిని తమ చేతులతో తాకి కళ్ళకి నుదుటికి అద్దుకుంటారు. ఇది దేవుడి ఆశీర్వాదంగా భక్తులు నమ్ముతారు.

ఇక అంతేకాక ఈ పచ్చ కర్పూరాన్ని కొన్ని సాంప్రదాయమైన వంటల్లో ప్రసాదాలలో ఉపయోగిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో, తమిళనాడులోని దేవాలయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనివలన ఆహారం మరింత సుగంధ భరితంగా రుచిగా తయారవుతుంది. మామూలు కర్పూరంతో పోలిస్తే పచ్చ కర్పూరంలో ఎన్నో ఉపయోగాలు ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛత, భక్తి, ఆరోగ్య ప్రయోజనాలను అందించడం ద్వారా హిందూ సంప్రదాయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ పచ్చ కర్పూరం పొందిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news