మళ్లీ పేరు మార్చుకున్న మెగా హీరో…..ఇక నుంచి అలానే పిలవాలట!

-

సుప్రీం స్టార్ సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన తనకంటూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. తన మొదటి సినిమా అంతగా ఆడకపోయినా రెండో సినిమా పిల్ల నువ్వు లేని జీవితం చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.యంగ్ హీరో సాయి తేజ్ తన పేరు మార్చుకున్నారు. ఇక నుంచి తన పేరు ‘సాయి దుర్గ తేజ్’ అని తెలిపారు.

ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో మేకర్స్ సాయి తేజ, స్వాతి కలిసి చేసిన ఒక ఇండిపెండెంట్ ఫిలిమ్ ను మీడియా ప్రతినిధులకు స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ…. సర్ నేమ్ మా నాన్న పేరు ఎలాగో ఉంటుంది. అమ్మ నాతో ఉండాలనే ఉద్దేశంతో నా పేరులో ‘దుర్గ’ను జత చేసుకుంటున్నా’ అని తెలిపారు. కాగా ఈ యంగ్ హీరో మొదట సాయి ధరమ్ తేజ్ గా ఉన్న పేరును 2019లో సాయి తేజ్ గా మార్చుకున్నారు. తాజాగా 2వ సారి పేరు మార్చుకోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news