ఆ ముంబై సోదరుల సాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

-

ప్ర‌ముఖ‌ ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పార్క్ క‌ళాశాల‌కు ముంబైకి చెందిన‌ భార‌త‌ సంతతి రూబేన్‌ సోదరులు ఊహించని విధంగా భారీ విరాళం ఇచ్చారు. 8 కోట్ల పౌండ్లు అంటే మన కరెన్సీ లో సుమారు రూ.770 కోట్లు వాళ్ళు విరాళంగా ఇచ్చారు. డేవిడ్ రూబేన్(81), సీమోన్‌ రూబేన్‌(78)లు ఆక్స్ఫర్డ్ కి ఈ విధంగా భారీ విరాళాన్ని అందించారు.

ఈ విరాళాన్ని స్కాలర్‌ షిప్‌ కార్యక్రమానికి గానూ ఆ సంస్థ వాడుతుంది. బాగ్దాది జెవీష్ క‌మ్యూనిటీకి చెందిన రూబెన్ సోద‌రులు ఇద్దరూ కూడా ముంబైలోనే పుట్టారు. 1950లో వారి తల్లి త‌ల్లి నాన్సీతో క‌లిసి బ్రిట‌న్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయ్యారు. సరిగా 30 ఏళ్ళ క్రితం అంటే 1990లో మైనింగ్, వస్తువుల వ్యాపారాలతో వారు ఈవితాన్ని మొదలుపెట్టారు. సీమోన్ కార్పెట్ ట్రేడ్‌లో బాగా సంపాదించారు.

ఇక డేవిడ్ కూడా పట్టింది ప్రతీ ఒక్కటి బంగారమే అయింది. స్క్రాప్ మెటల్ బిజినెస్‌లో బాగా ఆర్జించారు. ఇక ఈ ఇద్దరు అన్ని వ్యాపారాలు చేసేసి ఇప్పుడు రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌ చేస్తున్నారు. వీరు ఇద్దరూ కూడా ‘ది సండే టైమ్స్‌’ అనే పత్రిక లెక్కల ప్రకారం చూస్తే 16 బిలియన్‌ పౌండ్ల సంపదతో బ్రిటన్‌ లో రెండో స్థానంలో కుబేరుల జాబితాలో ఉన్నారు. దీనిపై సదరు సంస్థ హర్శమ వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news