జూన్‌లో అమలులోకి రానున్న కొత్త నిబంధనలు.. సామాన్యులకు గుండె గుబేలే..

-

నెల మారేకొద్ది కొత్త రూల్స్ కూడా మారుతూ ఉంటాయి.. గత నెలల్లో ఉన్నవాటికి చాలా మార్పులు వస్తుంటాయి.. ఇక మే నెల దాదాపు ముగిసిపోయింది.. ఇక జూన్ నెల మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది.. జూన్‌లో కూడా అమలులోకి రాబోయే కొత్త రూల్స్ అనేకం ఉన్నాయి. అందులో మీ డబ్బుపై ప్రభావం చూపించే రూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ కొత్త రూల్స్ తెలుసుకోవడం అవసరం. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధార్ కార్డ్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఇలా అనేక వాటిపై మార్పులు వచ్చినట్లు తెలుస్తుంది.. అవేంటో ఒకసారి చూద్దాం…


ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్. ఆధార్ కార్డులోని వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలంటే జూన్ 14 వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేస్తే రూ.50 ఫీజు చెల్లించాలి..

పిల్లల పేరుపై కొత్త అకౌంట్ తెరవాల్సిన అవసరం లేకుండా బ్యాంక్ అకౌంట్ నుంచే పిల్లల పేరుపై మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబీ తాజాగా ఈ విషయానికి వెల్లడించింది. ఈ కొత్త రూల్ 2023 జూన్ 15 నుంచి అమలులోకి వస్తుంది..

బ్యాంకుల్లో కూడా అనేక వాటిపై మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు..ఫిక్స్‌డ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ చేసి మర్చిపోయిన వారికి అలర్ట్. జూన్ 1 నుంచి బ్యాంకులు పిలిచి మరీ డబ్బులు ఇవ్వబోతున్నాయి.. కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి..

అదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలష్ డిపాజిట్ స్కీమ్ గడువును పొడిగించింది. జూన్ 30 వరకు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఎస్‌బీఐ 400 రోజుల గడువుతో అందిస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం వడ్డీ లభిస్తుంది..

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కొనేవారికి అలర్ట్. ప్రతీ నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలు సవరిస్తూ ఉంటాయి. గ్యాస్ సిలిండర్ ధర తగ్గొచ్చు, పెరగొచ్చు.. జూన్ 1 న ఏమౌతుందో చూడాలి.. ఇంకా పలు కీలక అంశాలు మారనున్నాయో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version