జగన్‌ మీదకు దూసుకొచ్చిన ఆగంతకుడు !

-

పులివెందులకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్‌కు బిగ్ షాక్ తగిలింది. కారు దిగి ఇంట్లోకి వెళ్లిపోతున్న జగన్‌ మీదకు ఓ వ్యక్తి దూసుకొచ్చారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులకు చేరుకున్నారు.

The person who attacked YS Jagan

ఈ క్రమంలో ఆయన కారు దిగి ఇంట్లోకి వెళ్లిపోతున్న సమయంలో ఓ వ్యక్తి జగన్ మీదకు దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పక్కకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. అయితే సదరు వ్యక్తి.. జగన్‌ను కలవడానికి వచ్చినట్టు సమాచారం.

ఇక అటు నేడు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. రేపు వైఎస్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.

https://x.com/ChotaNewsTelugu/status/1809763145000358038

Read more RELATED
Recommended to you

Exit mobile version