టీటీడీలో తెలంగాణకు వాటా…పేర్నినాని సంచలన వ్యాఖ్యలు !

-

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా ఏపీ పోర్టుల్లోనూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల్లోనూ తెలంగాణ వాటా కోరినట్టుగా వివిధ మీడియా సంస్థలు వార్తలను ప్రసారం చేశాయన్నారు. ఏడు మండలాల్లోని కొన్ని గ్రామాలను కూడా విలీనానికి ఏపీ సుముఖంగా ఉన్నట్టుగా కూడా ప్రచారం నడిచిందని ఆగ్రహించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు దీనిపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి ఒక మంత్రికాని, ఒక అధికారికాని ఎలాంటి ప్రకటనా చేయకపోవడం ప్రజల అనుమానాలను బలపరిచినట్టే అవుతుందని వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం- విభజన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వెనక్కిలాగే నిర్ణయంగా చూడాల్సి వస్తోంది. దీన్నొక కాలయాపన ప్రక్రియగా భావిస్తున్నామని వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు ఏంటి? అపరిష్కృత అంశాలు ఏంటి? పంచాల్సిన ఆస్తులు ఏంటి? ఎందుకు ముందుకు వెళ్లడంలేదు? వీటిపై కోర్టుల్లో ఉన్న కేసులు ఏంటి? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version