యూనిఫామ్ లో దర్శనానికి వెళ్తే ఊరుకునేది లేదు : విజయవాడ కమిషనర్

-

విజయవాడ ఇంద్రకీలాద్రి కొండాపై దసరా ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్సవ భద్రత ఏర్పాట్ల పై పోలీస్ కమిషనర్.. ఎస్.వి.రాజశేఖర్ బాబు స్పందించారు. సామాన్య భక్తులకు మంచి దర్శనం కల్పించాలనేదే మా లక్ష్యం. వీఐపీలకు కొంత అసౌకర్యం కలిగినా అర్ధం చేసుకోవాలి. వీఐపీలు టైమ్ స్లాట్ ప్రకారమే వస్తే మంచి దర్శనం జరుగుతుంది. 500 రూపాయల దర్శనం ఆలస్యమవుతోంది. 300 రూపాయల క్యూలైన్ దర్శనం త్వరితగతిన జరుగుతోంది.

అలాగే క్యూలైన్లలో పద్ధతి పాటించకుండా ప్రవేశించే భక్తులను నియంత్రిస్తున్నాం. పోలీస్ యూనిఫామ్ లో ఎవరు దర్శనానికి వెళ్లినా ఊరుకునేది లేదని హెచ్చరించాం. వీఐపీ దర్శనాలకు యాప్ అందుబాటులోకి తెచ్చాం. ట్రాఫిక్ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అస్ర్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నాం. సైబర్ క్రైమ్ పై అవేర్ నెస్ కార్యక్రమం చేపట్టాం. నిన్నటికి లక్షమందిని యాప్ లో సైబర్ అవేర్ నెస్ చేర్చాం. మూలానక్షత్రం రోజున మరింత పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి.. వాటిని పరిష్కరిస్తున్నాం అని విజయవాడ కమిషనర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version