రాజ్కోట్ వేదికగా ఇండియా , ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల తేడాతో గెలిచిన ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా నిర్దేశించిన 557 రన్స్ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 122 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇవాల్టి మ్యాచులో ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించారు.ఇక మూడో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 236 బంతులలో 14 ఫోర్లు, 12 సిక్సులతో 214 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచి తన కెరీర్ ను అద్భుతంగా ఆరంభించాడు. అతడి ఆట గురించి నేను గతంలో ఎన్నోసార్లు మాట్లాడాను. ఇప్పుడేం మాట్లాడను. ఇక సర్ఫరాజ్ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. అతడు బ్యాట్తో ఏం చేయగలడో చూశాం అని అన్నారు. ఇవాల్టి మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ అందుకున్న జడేజా మరోసారి తన క్లాస్ను చూపించాడు. గిల్ చక్కగా రాణించాడు’ అని రోహిత్ కొనియాడారు.