ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో జిలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ జీలుగు కల్లు కేసును పోలీసులు ఛేదించారు. పక్క ప్రణాళికతో హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాగ కేసు వివరాలను కాకినా ఎస్పీ రవీంద్ర నాథ్ బాబు వివరించారు. ఘటన జరిగిన లోదొడ్డి అనే గ్రామనికి చెందిన పొత్తూరు గంగరాజు భార్యతో అదే గ్రామానికి చెందిన రాంబాబుకు అక్రమ సంబధం ఉంది.
ఈ విషయం గంగ రాజు సోదరుడు లోవరాజుకు తెలిసింది. దీంతో ఇటీవల వచ్చిన కనుమ పండుగ రోజు రాంబాబుకు, లోవరాజు కు మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో లోవరాజుపై రాంబాబు కక్ష్య పెట్టుకున్నాడు. పథకం ప్రకారం తనకు ఉన్న జీలుగు చెట్లకు ఉన్న కల్లు కుండలలో గడ్డి మందు కలిపాడు. అయితే లోవరాజు, గంగరాజు, సుగ్రీవు, సన్యాసి రావు, ఏసూబాబు ఆ కల్లు ను తాగారు. దీంతో వీరు ఐదుగురు మరణించారు.
అప్పడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. కాగ విచారణలో జీలుగు చెట్టు వద్ద గడ్డి మందు డబ్బాను పోలీసులు గుర్తించారు. దీంతో రాంబాబును పోలీసులు అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో రాంబాబు అసలు నిజం చెప్పారని ఎస్పీ రవీంద్ర నాథ్ బాబు తెలిపారు.