తెలంగాణలో అధికారం మాదే..అమిత్ షా ఓపెన్..!

-

కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ..దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మెజారిటీ రాష్ట్రాలని బీజేపీ కైవసం చేసుకుంది. ఇదే క్రమంలో సౌత్ ఇండియాలో ఉన్న కీలక రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసింది. ముఖ్యంగా తెలంగాణళో బలపడుతున్న నేపథ్యంలో..అక్కడ అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ వెళుతుంది. అక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతుంది.

కేంద్రం పెద్దలు ఫుల్ గా తెలంగాణపై ఫోకస్ చేసిన విషయం తెలిసిందే..రాష్ట్ర బీజేపీ నేతలు..కేసీఆర్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళుతున్నారు. ఇటు కేసీఆర్ సైతం బీజేపీకి ఎలా చెక్ పెట్టాలా? అని చూస్తున్నారు. అయితే కేసీఆర్‌కు బీజేపీనే చెక్ పెట్టే దిశగా ముందుకెళుతుంది. ఖచ్చితంగా తెలంగాణళో అధికారం తమదే అనే ధీమా కమలదళంళో కనిపిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా అమిత్ షా..తెలంగాణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమిత్ షా ఒక జాతీయ మీడియాకు సంబంధించిన సమ్మిట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు

తెలంగాణలో వచ్చే ఎన్నికలలో బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల నాడి తమకు తెలుసని, వచ్చే ఎన్నికలలో బీజేపీ అధికారం చేపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తుందని చెప్పుకొచ్చారు. ఇటు కేంద్రంలో మోదీ నేతృత్వంలో మరోసారి అధికారంలోకి వస్తామని చెప్పారు.

అయితే తెలంగాణ గురించి అమిత్ షా..కాన్ఫిడెంట్ గా అధికారంలోకి వస్తామని చెప్పారు. అంటే తెలంగాణపై ఏ స్థాయిలో ఫోకస్ పెట్టారో అర్ధం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్తితుల్లోనూ తెలంగాణని చేజార్చుకునేలా లేరు. ఇప్పటికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉందనే నేపథ్యంలో 119 స్థానాల్లో ఇప్పటినుంచే అభ్యర్ధులని ఎంపిక చేసే పనిలో పడ్డారు. మొత్తానికి తెలంగాణని బీజేపీ వదిలేలా లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version