బాబా రాందేవ్ వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల బాబా రాందేవ్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహిళలు దుస్తులు లేకున్నా అందంగానే ఉంటారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాబా రాందేవ్. మహారాష్ట్రలో నిర్వహించిన యోగ సైన్స్ క్యాంప్ లో భాగంగా బాబా రాందేవ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై నారాయణ మండిపడ్డారు. మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకించడంతోపాటు.. బాబా రాందేవ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అదే సమయంలో మహిళలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాల్సిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యోగాను కార్పొరేట్ వ్యవస్థగా మార్చి.. పతంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని, యోగా పేరుతో అందరి దగ్గర సానుభూతిగా నటిస్తూ వెనకాల కార్పొరేట్ వ్యవస్థను నడుపుతున్నారని ఆరోపించారు.