కరోనా పోతుందని మనిషిని బలిచ్చిన పూజారి…!

-

ఒడిశా కటక్‌లోని దారుణం జరిగింది. కరోనా వైరస్ ని అంతం చేసుకోవడం తో పాటుగా దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి గానూ ఒక వృద్ధ పూజారి ఒక మనిషిని చంపేసాడు. ఇందుకోసం బ్రతికి ఉన్న ఒక మనిషి తల నరికాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి ఒడిశాలోని కటక్ జిల్లాలోని నరసింగ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంధహూడ సమీపంలోని ఒక ఆలయంలో చోటు చేసుకుంది.

పూజారిని అధికారులు 72 ఏళ్ళ సంసారి ఓజా గా గుర్తించారు. ఈ నేరానికి పాల్పడిన వెంటనే అతను బుధవారం రాత్రి పోలీసుల ముందు లొంగిపోయాడు. మృతుడిని సరోజ్ కుమార్ ప్రధాన్ (52) గా గుర్తించారు. ఈ ఘటన జరిగే ముందు వాగ్వాదం జరిగింది అని… వాదన తీవ్రతరం కావడంతో, ఓజా అతన్ని పదునైన ఆయుధంతో అక్కడే హతమార్చాడు. ఇక పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేయగా… తనకు దేవుడు కలలో కనపడి ఆదేశాలు ఇచ్చాడని చెప్పాడు.

ఇది కరోనా వైరస్ ని తొలగిస్తుంది అని తాను నమ్మినట్టు అతను చెప్పడం విశేషం. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని ఒక పోలీస్ అధికారి మీడియా కు వివరించారు. అయితే ఈ ఘటనపై మాట్లాడిన గ్రామస్తులు… పూజారికి మృతుడి కి మధ్య మామిడి తోట విషయంలో గొడవ ఉందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version