ప్రముఖ హీరోయిన్ శోభన..పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!!

-

అలనాటి తార శోభన..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. డ్యాన్సర్ గా శోభనకు ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భరత నాట్యంలో దిట్ట అయిన శోభన ఎంతో మందికి ఈ నాట్యం నేర్పిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో పలు చిత్రాల్లో నటించిన శోభన..వ్యక్తిగత జీవితం విషయానికొస్తే..ఒంటరిగానే మిగిలిపోయింది. పెళ్లి చేసుకోకుండానే ఉండిపోయింది. అందుకు గల కారణమేంటో తెలుసుకుందాం.

శోభన అసలు పేరు శోభన చంద్రకుమార్ పిల్లాయ్. కాగా, ఈమె తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. అన్ని ఇండస్ట్రీలలో స్టార్ హీరోలందరి సరసన దాదాపుగా హీరోయిన్ గా నటించిన శోభన..డ్యాన్సర్ గా చక్కటి పేరు సంపాదించుకుంది. కాగా, ఈమె పెళ్లి చేసుకోకుండా ఉండటానికి లవ్ ఫెయిల్యూర్ యే కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆ వార్తల ప్రకారం..శోభన..మలయాళ నటుడు ఒకరిని ప్రేమించగా, ఆయన మాత్రం ఆమెను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారట. దాంతో శోభన పెళ్లి చేసుకోకుండానే జీవనం సాగిస్తున్నదని అప్పట్లో వార్తలొచ్చాయి.

ఇక నటి శోభన..తెలుగులో స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసింది. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’లో కథానాయికగా నటించింది. 51 సంవత్సరాల శోభన ఇప్పటికీ పలువురికి సంప్రదాయ నృత్యాలు నేర్పిస్తోంది. భరతనాట్యంలో దిట్ట అయిన ఈమె శిష్యులు చాలా మంది సినీ రంగంలోకి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగార్జునతో పాటు పలువురు హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శోభన.

Read more RELATED
Recommended to you

Exit mobile version