తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది:మంత్రి సీతక్క

-

పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రైతులపై భారం పడనివ్వమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ సీజన్ నుంచే స్కీమ్ అమల్లోకి వస్తుందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. అకాల వర్షాలకు తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.

కొనుగోలు వేగవంతం చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలిచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా కురుస్తున్న వానలకు పంటనష్టం జరిగిందని,కల్లాలలో తడిసిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందన్నారు మంత్రి సీతక్క. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరపున చర్యలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news