మీ అర్హతకి తగినది దొరక్కపోవడానికి కారణమేంటో తెలిపే గడియారం కథ మీకోసం..

-

టైమ్ ఫియర్ లెస్ యూట్యూబ్ వారు పోస్ట్ చేసిన ఒకానొక చిన్న కథ ఆలోచింపజేసేలా ఉంది. మనకి కావాల్సింది దొరక్కపోవడానికి, మన అర్హతకి తగినది దొరక్కపోవడానికి గల కారణాలను తెలుపుతూ ఒక చిన్న కథ యూట్యూబ్ లో పబ్లిష్ అయ్యింది.

ఒక ఊరిలో తండ్రి, కొడుకు ఉండేవారు. తండ్రి ముసలివాడయ్యాడు. ఎక్కువ రోజులు బతకడు. ఆ విషయం తండ్రితో పాటు కొడుక్కి కూడా తెలుసు. అందుకే తండ్రి చెప్పిన అన్ని పనులని చేసుకుంటూ వస్తున్నాడు. ఇద్దరూ ఏదైతే ఊహించారో ఆ రోజు రానే వచ్చింది. తండ్రి మరణ శయ్యపై చావు కోసం ఎదురుచూస్తున్నాడు. కొడుకు అతని పక్కనే కూర్చుని ఉన్నాడు. తండ్రి, కొడుకుని దగ్గరగా పిలుచుకుని ఒక పనిచెయ్యమని అడిగాడు.

తన చేతికి ఉన్న వాచీని తీసి కొడుక్కి ఇచ్చి, ఇది మా నాన్న నాకిచ్చాడు. మా నాన్నకి వాళ్ళ నాన్న ఇచ్చాడు. దీన్ని తీసుకెళ్ళి మార్వాడి షాపు వద్దకి వెళ్ళు. అతడెంత డబ్బు చెల్లిస్తాడో కనుక్కో అని చెప్పాడు. కొడుకు మారు మాట చెప్పకుండా వెళ్ళాడు. మార్వాడి షాపు వాడు పదివేల రూపాయలు ఇస్తా అన్నాడని చెప్పాడు. అప్పుడు అదే వాచీని పాన్ షాప్ అతనికి అమ్మితే ఎంతకిస్తాడో కనుక్కోమన్నాడు. కనుక్కుని ఐదు వందలు ఎక్కువ అంటున్నాడని చెప్పాడు. అప్పుడు, మ్యూజియం యజమాని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాడు.

తండ్రి ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని కొడుకు, చెప్పినట్టే చేసాడు. మ్యూజియం ఓనర్ ఆ వాచీకి లక్ష రూపాయలు చెల్లిస్తానన్నాడు. చాలా పురాతన కాలం నాటి ప్రత్యేకమైన వాచీ గనక అంత డబ్బు ఇస్తానన్నాడు. అంటే నీ వాల్యూ ఏంటనేది నీకు తెలియదు. నీకు వచ్చే అవకాశాలని బట్టి నీ విలువ పెరుగుతుంది. అందుకే గొప్ప అవకాశాలను పట్టుకోవాలి. అప్పుడే గొప్పవారవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version