భారత్ రష్యా ల మధ్య సాగిన సమావేశం ద్వారా రెండు దేశాల మధ్య ప్రత్యేక మైన, వ్యూహాత్మక మైన భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయం లో కూడా ఈ రెండు దేశాల మధ్య సంబంధాల లో ఎలాంటి మార్పు చెందలేదని పుతిన్ అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం ఎప్పుడూ స్థిరం గా ఉంటుందని తెలిపారు. అలాగే తాము భారత్ ను గొప్ప శక్తి గా చూస్తున్నామని తెలిపారు.
ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య మ్యూచువల్ ఇన్వెస్ట్ మెంటులు దాదాపు 38 బిలియన్ డాలర్లు గా ఉన్నాయని తెలిపారు. అలాగే భారత్ కు తమ దేశం నుంచి ఎక్కువ మొత్తం లో పెట్టుబడులు వస్తున్నాయని ప్రకటించారు. భారత్ కు రక్షణ పరంగా తమ దేశం ఎప్పుడూ సహాయం చేస్తుందని తెలిపారు. ఉగ్రవాదం పై కూడా కలిసి పోరాడుదామని తెలిపారు. అలాగే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకం గా కూడా పోరాటం చేస్తామని తెలిపారు. అలాగే ఆఫ్ఘాన్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల పై ఆందోళన చెందుతున్నామని అని అన్నారు. కాగ ఈ రోజు భారత్ రష్యా ల మధ్య 21 వ వార్షిక సమావేశం జరిగింది.