సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర హైటెనషన్ వాతావరణం నెలకొంది. కేజీవాల్ను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈడీ ఆఫీసుకు వెళ్లేందుకు కేజీవాల్ నిరాకరించారు. ఇంట్లోనే ప్రశ్నించాలని ఆయన కోరారు.సెర్చ్ వారెంట్ తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఫోన్,ఆయన భార్య ఫోన్లను సీజ్ చేశారు.ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ క్రేజీవాల్ను ఈడీ అరెస్ట్ చేసినా ముఖ్యమంత్రిగా రాజీనామా చేయరని ఆయన చెప్పారు. మనీశ్ సిసోడియాను అరెస్టు చేసి.. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని ఆయన అన్నారు. ఎన్నికల ముందు కేజీవాల్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కాగా, ఈ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావడానికి తనకు అభ్యంతరం లేదని, ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించినా కేజీవాల్ కి ఫలితం లేకుండా పోయింది. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపిన సంగతి తెలిసిందే.