17 వారాల ముందు పుట్టిన శిశువు ప్రాణాలు కాపాడారు వైద్యులు. యూకేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 0.5 కిలోల బరువు అలాగే గుండెలో రంధ్రంతో బయటకు వచ్చింది. నాలుగు నెలలు ఆ శిశువుకి విజయవంతంగా వైద్యం చేసి డిశ్చార్జ్ చేసారు. మిల్లీ అనే పేరు ఉన్న శిశువు ఏప్రిల్ లో టిఫనీ బుషెల్ మరియు ఆమె భర్త మాథ్యూ దంపతులకు పుట్టింది.
వాట్ఫోర్డ్ నుండి వచ్చిన ఈ జంట, తమ కుమార్తె 17 వారాల ముందు పుట్టడమే కాకుండా ఏడు అంటువ్యాధులతో పోరాడుతుండటంతో బ్రతకడం కష్టం అని కంగారు పడ్డారు. దీనికి తోడు గుండెలో రంద్రం ఉందని వైద్యులు చెప్పారు. రోగ నిర్ధారణ అనంతరం మిల్లీ తన జీవితంలో మొదటి ఐదు వారాలు వెంటిలేటర్‌లోనే ఉండటం గమనార్హం. పుట్టిన రెండు రోజులకు శ్వాస తీసుకోవడం ఆపేసింది. పుట్టిన నాలుగు నెలల తరువాత, చివరికి ఆమె తల్లిదండ్రులు గత వారం ఇంటికి తీసుకువెళ్లారు. 2018 లో తమ మొదటి కుమార్తె రూబీని కోల్పోయిన ఈ జంట, మిల్లీ కోలువడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.