మాజీ ఎంపీ బీజేపీ నేత జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందె ముందు… మేము పడ్డ టెన్షన్ మామూలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజు ఏన్నో కలలు కన్నాం అని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ కలలేవి నెరవేరడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. కేసీఆర్ కూర్చివేసుకుని మరీ ప్రాజెక్టు లు పూర్తి చేస్తా అన్నప్పుడు పొంగిపోయామని ఆయన పేర్కొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులు పూర్తయితే… శంషాబాద్ ,బెంగళూరు అగ్రో కారీడార్ ఏర్పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అపెక్స్ కౌన్సిల్ లోనే కేసీఆర్ పప్పు లో కాలేసాడని ఆయన ఎద్దేవా చేసారు. మనది ధనిక రాష్ట్రం కేంద్ర నిధులు లేకుండానే మనం ప్రాజెక్టులు పూర్తి చేద్దామని కేసీఆర్ చెప్పిండు అంటూ ఆయన గుర్తు చేసుకుని కేసీఆర్ పై విమర్శలు చేసారు.