ఒంటరిగా ఫీల్ అయినపుడు దాన్నుండి బయటపడాలంటే చేయాల్సిన పనులివే..

-

ఒంటరితనం.. ఎవ్వరికీ మంచిది కాదు. ఒంటరిగా ఉండడం అంత తేలికా కాదు. చుట్టూ మనుషులు లేకపోతే భూమి మీద ఉన్నామా అన్న ఫీలింగ్ కలిగుతుంది. ఐతే జీవితంలో చాలా సార్లు ఒంటరిగా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి. అందరూ ఉండి కూడా ఎవరూ లేకుండా అయిపోయారే, ఒంటరిగా మిగిలానా అన్న సందర్భాలు చాలా వస్తాయి. ఐతే ప్రతీసారీ అలా జరగడం మంచిది కాదు. అదీగాక ఆ ఫేజ్ లో ఎక్కువ సేపు ఉండడం కూడా మంచిది కాదు. ఒంటరితనం నుండి అనేక చెడు ఆలోచనలు పుట్టుకొస్తాయి. అలాంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే, ఒంటరితనం నుండి తొందరగా బయటకు రావాలి. దానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

నీకెవ్వరూ లేరని నీకనిపించినపుడు నిన్ను నువ్వు తిట్టుకోకు. జరిగిందేదో జరిగిపోయింది కాబట్టి, నిన్ను బ్లేమ్ చేసుకోకు.

నీకు అత్యంత దగ్గరగా అనిపించే ఫ్రెండ్ ఉంటే వారిని కలవండి. మీ బాధకి సలహాలు సూచనలు ఇవ్వకుండా కేవలం మీ బాధ వినే వాళ్ళని కలుసుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు సలహాలు ఇబ్బంది పెడతాయి.

క్రియేటివ్ గా ఏదైనా చేయండి. చిన్నపనైనా సరే మీకు నచ్చింది చేయండి. ఒంతరితనంలో నుండీ బయటకి రావడానికి అదే సరైన మందు.

ఒంటరిగా అనిపించినపుడు ఒక్కరే ఉండకండి. నలుగురిలోకి వెళ్ళండి. వారితో మాట్లాడండి.
కొత్త వాళ్లతో మాట్లాడిన బాగానే ఉంటుంది. మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే మీకు నచ్చిన పుస్తకం తీసుకుని చదవండి. సినిమా చూసే అలవాటున్న సినిమా చూసేయండి.

వంట చేయడం కూడా ఒంటరితనాన్ని పోగొడుతుంది. ఈ టైమ్ లో హాబీలు బాగా పనిచేస్తాయి. అందుకే మీ హాబీలు పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version