అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా సరే ఆయన మాత్రం చైనా విషయంలో పగ సాధిస్తూనే ఉన్నారు. కీలక విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని భావించినా సరే ఆయన మాత్రం చైనా విషయంలో కఠినంగా వ్యవహరించారు. తాజాగా తీసుకున్న నిర్ణయంలో, డొనాల్డ్ ట్రంప్ సర్కార్… వీసా నిబంధనలను సవరించింది.
చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ కి చెందిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యులను అమెరికాకు ప్రయాణించకుండా పరిమితం చేసింది. కొత్త వీసా విధానం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సభ్యులకు మరియు వారి కుటుంబాలకు బి 1-బి 2 సందర్శకుల వీసాల గరిష్ట ప్రామాణికతను ప్రస్తుతం ఉన్న 10 సంవత్సరాల నుండి కేవలం ఒక నెల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.