తమిళనాడు లో జరిగిన ఆర్మి హెలికాప్టర్ ప్రమాదం లో మృతి చెందిన సీడీఎస్ బిపిన్ రావత్ భౌతిక కాయానికి నివాళ్లు అర్పించడానికి రాజ్య సభ చైర్మెన్ వెంకయ్య నాయుడు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ రాజ్యసభ పక్ష నేత మల్లి కార్జున ఖర్గే విమర్శించారు. రాజ్య సభ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయం పై ప్రకటన చేసిన తర్వాత బిపిన్ రావత్ కు నివాళ్లు అర్పించడా నికి ప్రతిపక్ష ఎంపీల కు అనుమతి ఇవ్వాలని కోరానని అన్నారు.
కానీ రాజ్య సభ చైర్మెన్ వెంకయ్య నాయుడు అనుమతి ఇవ్వలేదని మల్లి కార్జన ఖర్గే అన్నారు. ఈ విషయం లో వెంకయ్య నాయుడు అనుసరించిన తీరు చాలా దారుణమైందని మండి పడ్డారు. వెంకయ్య నాయుడు ఏక పక్షం గా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. అయితే దీని పై రాజ్య సభ డిప్యూటీ చైర్మెన్ స్పందిస్తూ.. సభ లో ఎంపీ లు సంతాపం తెలిపారని అందుకే ప్రత్యేక్షం గా నివాళ్లు అర్పించడానికి అనుమతి ఇవ్వలేమని తెలిపారు.